కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి సంచలన వాఖ్యలు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 28: కూకట్‌పల్లి ప్రతినిధి
దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేసి గెలువు
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
తెలంగాణ ద్రోహి మాధవరం కృష్ణారావు
95 శాతం అభివృద్ధి చేశాను అంటున్నావు నీ ఇంట్లో నుంచి తెచ్చావా!!
బిజెపి, కాంగ్రెస్ ఒక్కటైతే సీఎం రేవంత్ రెడ్డి బిజెపిని ఎందుకు తిడతాడు..
పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓట్లు బిజెపికి వేయించింది నిజం కాదా!
హైడ్రా ముసుగులో బిఆర్ఎస్
హై డ్రామా.
కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సుద్దపూస మాటలు మానుకో చెరువుల అభివృద్ధి పేరుతో చెరువు స్థలాలను మాయం చేసి, అక్రమంగా సంపాదించింది నిజం కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో వస్తే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నావు కదా. గతంలో నీకు టిడిపి వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే నువ్వు కూడా అభివృద్ధి పేరుతోనే కదా టిఆర్ఎస్ పార్టీలోకి పోయావు అప్పుడు నువ్వు రాజీనామా చేసావా!!!!
అసలు నీకు దమ్ముంటే గత ఎన్నికల్లో 95 శాతం అభివృద్ధి జరిగిందని ఎన్నికల్లో కెళ్ళి ప్రజలు నిన్ను నమ్మి గెలిపించారు…!!! సరే అదే మాట ఇప్పుడు చెప్పి రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నికల్లోకి రా!!! ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
అసలు నువ్వు నమ్ముకున్న పార్టీకి మోసం చేసి టిఆర్ఎస్ లో చేరలేవా? ఇది ప్రజలకు తెలియదా? అని అన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు భవిష్యత్తులో రాజకీయ పుట్టగతలే ఉండవని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టించి ఉద్యమకారులను అణిచివేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బిజెపి కాంగ్రెస్ ఒకటేనని మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కేడర్ తో బిజెపికి పని చేయించి ఓట్లు వేసి టిఆర్ఎస్ అభ్యర్థికి మోసం చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఎవరు ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారో కాలమే నిర్ణయిస్తుంది ఇది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గమనించాలన్నారు.