తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి పట్టణంలోని 6వ, వార్డులోని సరంపల్లి లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్, గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది కలగకుండా చూడాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని, విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పెట్టాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు, మెనూ ప్రకారం ఆకు కూరలు, కూరగాయలు,గుడ్లు,పప్పు, ఉండేటట్టు చూడాలని, మంచినీటి సౌకర్యం కూడా ఉండేటట్టు చూడాలని ఆదేశించారు,ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప,పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ,పిడుగు మమతా సాయిబాబా,పాఠశాల ప్రిన్సిపాల్, అమర్ సింగ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 7