Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వాలు నమోదు చేసుకోండి

IMG 20241230 203613

టి యు డబ్ల్యూ జె రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ

ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ లో సభ్యత్వాలు నమోదు చేసుకోండి. జర్నలిస్టులందరూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడంలో ముందుండి అందరూ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించడానికి ఢిల్లీ వరకు మన జర్నలిస్టులు అందరూ కలిసి పోరాటం చేసి, మనకు కావలసిన హక్కులను ముఖ్యంగా మన తెలంగాణను సాధించుకోవడంలో కీలకపాత్ర పోషించామని, తెలంగాణలో టి యు డబ్ల్యూ జే యూనియన్ ఏ యూనియన్ చేయలేని, పనులను మన టి యు డబ్ల్యూ జే యూనియన్ చేసిందని. రానున్న రోజుల్లో మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా జర్నలిస్టులందరూ పాల్గొన్నారు.

Exit mobile version