తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్-సిఐటియు రాష్ట్ర 4 వ మహాసభలు జయప్రదం చేయండి
గజ్వేల్ డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం :
తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 4,5 సిద్దిపేటలో రాష్ట్ర మహాసభల సందర్భంగా గజ్వేల్ డివిజన్ ఆఫీస్ ముందు జెండావిష్కరణ చేయడం జరిగింది.అనంతరం గజ్వేల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సిరినేని భూపతి రాజు మాట్లాడుతూ నేడు ఆదివారం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళానిలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి 2022 విద్యుత్తు అమెండ్మెంట్ బిల్లును విద్యుత్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకంగా చర్చించి భవిష్యత్తులో వాటి పరిష్కారానికి పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుంది. కావున ఈ రాష్ట్ర మహాసభలకు ఈ ఈ ఎఫ్ ఐ ఆల్ ఇండియా కార్యదర్శి సుదీప్ దత్ మరియు నవ తెలంగాణ తెలుగు దినపత్రిక ఎడిటర్ సుధా భాస్కర్ ముఖ్యఅతిథిలు గా పాల్గొంటున్నారు. కావున కార్మికులందరూ 4 న ఉదయం 9:30 గంటలకు ఓపెన్ సెషన్ మీటింగు ఉంటుంది. కాబట్టి కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ కవిత ఎల్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దూలం యాదగిరి గౌడ్, గజ్వేల్ డివిజన్ జాయింట్ సెక్రెటరీ చెంద్రం యాదవ్, గజ్వేల్ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుర్రం శ్రీనివాస్ గజ్వేల్ డివిజన్ మీటర్ రీడర్ అధ్యక్షులు కర్ణాకర్, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.