- తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు..
- కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
- కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై మహేష్ గౌడ్ సీరియస్
హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావుకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నారని.. కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మహేష్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.కవిత బీసీల కోసం ఉద్యమం ఎక్కడ చేసింది: మహేష్ గౌడ్.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లు బీసీలకు కేసీఆర్ చేసింది ఏంటని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కవిత ఇప్పటిదాకా బీసీల కోసం ఒక్కమాట అయినా మాట్లాడారా అని నిలదీశారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత.. తన ఉనికి కోసమే మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌తో ఆస్తి పంపకాల వాటా కోసమే కవిత తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. కవిత బీసీల కోసం ఉద్యమం ఎక్కడ చేసిందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.బీజేపీకి మహేష్ గౌడ్ కౌంటర్బీజేపీకి మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం బీసీ నాయకుడు దొరకలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనేకమందికి అవకాశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మైనార్టీలకు త్వరలోనే అవకాశం ఇస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.–కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై మహేష్ గౌడ్ సీరియస్ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు..