మర్కుక్ సెప్టెంబర్ 9 ప్రశ్న ఆయుధం :
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ స్లివరాజు మరియు తెలుగు ఉపాద్యాయులు నరేందర్ నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ సంబరాలు సోమవారం చాలా ఘనంగా జరిగాయి. వారం రోజుల నుండి పాఠశాలలో వ్యాసరచన,వక్తృత్వ,
పద్యపఠన పోటీలు జరిగాయి..
6 నుండి 10 తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించి, తెలుగు భాష పట్ల ఉన్న ఆసక్తిని తెలిపారు. ఈ సందర్భంగా 6,7,8 తరగతులకు నరేందర్ మెమోoటోలు,షీల్డ్ లు మరియు కన్సోలేషన్ ప్రైజ్ విజేతలకు అందజేశారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి బహుమతులు అందజేశారు. 9,10 తరగతుల విజేతలకు నాగార్జున సాగర్ ఎగ్జామ్ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్,కంపాక్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు జీవిత చరిత్రను వివరించారు. ఈ పోటీలు నిర్వహించి విజేతలకు, విద్యార్థులందరికీ బహుమతులు తెచ్చి ఇచ్చిన నరేందర్, సాగర్ ను అభినందిస్తూ , పిల్లల అబివృద్దికి తమ వంతు కృషి చేస్తున్న ఇద్దరినీ ప్రశంసించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం మనందరం కృషి చేయాలని,తెలుగు భాష అమ్మ భాష అని, మాతృ భాషలో ఉన్న గొప్పతనం అందరూ తెల్సుకోవాలి అని అన్నారు. తెలుగు ఉపాద్యాయులు నరేందర్ నాగార్జున సాగర్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు జీవితం మనకు ఎంతో స్ఫూర్తి దాయకం అని, పిల్లలందరూ చాలా ఉత్సాహంగా అన్నీ పోటీలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. చాలా మంది విద్యార్థులు 40 పద్యాల వరకు నేర్చుకున్నారని, స్వామి వివేకానందుని జీవిత చరిత్రను సొంతంగా తెలుసుకున్నారని అన్నారు. ఈ పోటీల వల్ల చాలా మంది పిల్లల్లో చదవాలనే ప్రేరణ, కొత్త విషయాలను అభ్యసించాలనే ఉత్సాహం, పద్యాలు అభ్యసించాలనే కోరిక కలిగింది అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలలో ఈ విధమైన పోటీతత్వం పెరగడం అనేది. తెలుగు భాష ఉపాధ్యాయులుగా మాకు ఎంతో సంతోషదాయకం అని అన్నారు. ఉపాధ్యాయులుగా మాకు ఇంతకంటే ఎక్కువ ఆనందం ఏమి లేదని అన్నారు.