తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి

*తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలి*
*ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్ గుప్తా*

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 4*

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం జరిగిందని అట్టి పేరును తొలగించ వద్దు తెలుగు మాట్లాడే ప్రజల కోసం తెలుగు భాష కోసం తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అటువంటి వ్యక్తి త్యాగాన్ని ముందు తరాలకు అందించాలంటే తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరును కొనసాగించాలని ఆర్యవైశ్య సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు చిదురాల నగేష్ గుప్తా కోరారు ప్రాంతాలకతీతంగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు ఒకవేళ పేరు తొలగించినట్లు అయితే ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో ధర్నాలు బందులు కొనసాగిస్తామని తెలిపారు

Join WhatsApp

Join Now