పేద ప్రజలకు అండగా ఆలయ ఫౌండేషన్ సేవలు

*పేద ప్రజలకు అండగా ఆలయ ఫౌండేషన్ సేవలు*

*నిరుపేద యువకుడికి జైపూర్ కృత్రిమ కాలు అమరిక*

*ఆలయ పౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్*

*జమ్మికుంట జనవరి 27 ప్రశ్న ఆయుధం*

మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి మార్గదర్శకత్వంలో ఏర్పాటైన ఆలయ ఫౌండేషన్ పేద ప్రజలకు అండగా నిలిచి విస్తృత సేవలు అందిస్తుందని ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదే గుణసాగర్ అన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు బుర్ర అరుణ్ గౌడ్(22) ప్రమాదవశాత్తు తనఎడమకాలు కోల్పోయి ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించగా ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో శ్రీ భగవాన్ మహవీర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తనకు జైపూర్ ఫుట్ ను అమర్చారు వారి కుటుంబ సభ్యులు నరహరి ఐఏఎస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాడి గుణసాగర్ లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now