తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నిక రానుందా⁉️

తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నిక రానుందా⁉️

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు విచారిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది.

ఇవన్నీ నిశితంగా గమనిస్తే.. తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నిక రావడం ఖాయామన్న విషయం స్పష్టమవుతుంది.

అంతే కాదు.. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పార్టీ కార్యకర్తలతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనం సృష్టించాయి.

అన్నీ గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. తాను కొడితే మామూలుగా ఉండదు అంటూ.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైనట్టు నిన్న కేసీఆర్ హింట్ ఇచ్చారు.

త్వరలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుతో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారు. ఇవి దృష్టిలో పెట్టుకొనే.. తాను త్వరలో ప్రజా క్షేత్రంలోకి వస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారని టాక్ నడుస్తుంది.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పేలా లేదు.

గత కొన్ని రోజులగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రేవంత్ సర్కార్‌కు గడ్డుకాలం నడుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. అన్ని వర్గాల ప్రజల ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది.

మొన్నటికి మొన్న కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో నిర్వహించిన పోల్‌లో కూడా కాంగ్రెస్ పాలన బాగాలేదు అని సుమారు 70% మంది ప్రజలు ఓటేశారు.

భారతదేశ చరిత్రలో అధికారంలో వచ్చిన ఏడాది కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత సంపాదించుకున్న మొట్టమొదటి ప్రభుత్వం బహుశా ఇదేనేమో.

ఇలాంటి తరుణంలో.. ఉప ఎన్నికలకు కనుక వస్తే రేవంత్ రెడ్డికి చుక్కలు కనిపించడం తథ్యం.

అంతే కాదు.. ఫిబ్రవరి నెలాఖరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా నిన్న కేసీఆర్ ప్రకటించారు.

ఈ సభను తన పార్టీ శ్రేణులను ఉప ఎన్నికల కోసం సమాయత్తం చేసేందుకు కేసీఆర్ ఉపయోగించుకోనున్నాడా అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment