కెసిఆర్ కు పదేళ్ళు.. రేవంత్ రెడ్డికి ఏడాది

కెసిఆర్ కు పదేళ్ళు.. రేవంత్ రెడ్డికి ఏడాది అతి తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత!

ప్రగల్ బాలు పలికిన కేసీఆర్ మట్టికరించారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్.

గజ్వేల్, 16 ఫిబ్రవరి 2025 : BRS పార్టీ పరంగా అభ్యర్థిని నిలబెట్టలేక పోయింది. కాంగ్రెస్ కూడా ఈయన మా అభ్యర్థి అని నిలిపే ప్రయత్నం చేయలేదు. పట్టభద్రులు, టీచర్లు సామాజిక దృక్పదం, ప్రాపంచిక దృక్పదం ఉన్నవారు. స్వతంత్ర ఆలోచనతో ఓటు వేస్తారు. ఎవరిని ఎన్నుకుంటే రేపు మాకోసం నిలబడతారు అనే ఆలోచించి ఓట్లు వేస్తారు. టీచర్ల ట్రాన్స్ఫర్స్ సమయంలో 317 జీఓ తెస్తే దానికి వ్యతిరేకంగా బరిగేసి కొట్లాడిన పార్టీ బీజేపీ అని స్పష్టంగా టీచర్లలో ఉంది. ఆనాడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పి టీచర్ల దుఃఖానికి కారణం అవుతున్న పార్టీ కాంగ్రెస్.టీచర్ల బాధ ఇంకా కొనసాగుతుంది. అందుకే మా అభ్యర్థికి ఓటు వేస్తే మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అమెరికా సైతం ఆంక్షలు విధించిన నేపథ్యంలో మన పిల్లలకు మనమే ఉద్యోగావకశాలు కల్పించాలి, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని.. నాణ్యమైన యువశక్తిని తయారుచేయాలని 2024-25 బడ్జెట్ లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు బాజాప్తా పెట్టారు. మోదీ గారి ప్రభుత్వం మొదటి సారిగా ఈ ప్రయత్నం చేస్తుంది. నిరుద్యోగ సమస్య కంటే పెద్ద సమస్య లేదు అని భావిస్తున్నారు. భారత అభివృద్ధిలో నిరుద్యోగులను భాగస్వామ్యం చేయకపోతే క్షమించరాని తప్పు అని భావించి ఈ పని చేస్తుంది. కెసిఆర్ గురించి తెలుసుకోవడానికి పదేళ్లు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఒక యాడాదిలోనే బయటపడిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు విమర్శించారు ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ను నమ్మడం లేదని ఒక్క బీజేపీ నే మాత్రమే నమ్ముతున్నారని పేర్కొన్నారు ఇవాళ ఆయన గజ్వేల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ గడ్డమీద తమకు తిరుగు లేదని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ను ఆయన పార్టీని గత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపించాలని తెలిపారు తనతోపాటు అనేకమంది బీసీ నేతలను బయటకు పంపిన పార్టీ బిఆర్ఎస్ అని వారి పాలనలో మంత్రులంతా ఉత్సవ విగ్రహాలేనని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అవకాశం ఇచ్చి ఉంటే ఆ పార్టీకి ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు బీసీ అని మాట ఇస్తే అర్హత ఆ పార్టీకి కెసిఆర్ కుటుంబానికి అర్హత లేదన్నారు కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా బీసీలకే అవకాశం లభించింది అన్నారు 37 జీవోతో టీచర్లను కెసిఆర్ హింసిస్తే బిజెపి అండగా నిలిచిందని గుర్తు చేశారు అలాగే తాను గజ్వేల్ లో పోటీ చేస్తే ప్రజలు గొప్పగా ఆదరించారు అని అన్నారు కేంద్రం నిధులు ఇస్తేనే గ్రామంలో పనులు జరుగుతున్నాయని అన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ప్రవర్తిస్తున్న తీరును చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు తెలంగాణలో బిజెపికి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందని అనుకుంటున్నారని చెప్పారు నిరుద్యోగుల టీచర్స్ మహిళలు యువకులు రైతుల సమస్యలు తీరాలంటే బిజెపి రావాలని అందరూ కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మెహన్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి, యెల్లు రాంరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, కప్పర ప్రసాద్ రావు, వెంకటరమణా, నందన్ గౌడ్, సింగం సత్తయ్య, కుడిక్యాల రాములు, వివిధ పట్టణ, మండలాల మనోహర్ యాదవ్, అశోక్ గౌడ్, బాల్ రెడ్డి, రామ్ రెడ్డి ఐలయ్య యాదవ్, మన్నే శ్రీనివాస్ సంపత్ రెడ్డి, సత్యం ముదిరాజ్, జానకిరామ్ గౌడ్, బక్క వెంకటేష్, నత్తి శివకుమార్ ఎల్కంట్టి సురేష్, బండారు మహేష్ వెంకట్ రెడ్డి మడ్గురి నర్సింహా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now