విషాదం..సిద్దిపేట జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య..!!
సిద్దిపేట : అప్పుల బాధతో కౌలు రైతు(Tenant farmer) ఆత్మహత్య(Suicide) చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా(Siddipet district) తొగుట మండల పరిధిలోని గల కన్గల్ గ్రామంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొమ్మాట స్వామి(35)అనే రైతు గత ఐదు సంవత్సరలుగా గ్రామానికి చెందిన పెద్దమాతర మల్లయ్య వద్ద మూడు ఎకరాల వ్యవసాయ పోలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అయితే పంటలు సరిగా పండనందున అప్పులు ఎక్కువై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు.చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితంపై విరక్తి చెంది తను కౌలుకు చేస్తున్న వ్యవసాయ పొలం వద్ద వేప చేట్టుకు ఉరి వేసుకొని చనిపోయినాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుడి భార్య దొమ్మాట లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నాట్లు ఎస్‌ఐ వి.రవికాంతారావు తెలిపారు. స్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.