Site icon PRASHNA AYUDHAM

కౌలు రైతులకు,వ్వవసాయ కూలీల ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

IMG 20250104 190544

కౌలు రైతులకు,వ్వవసాయ కూలీల ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

గజ్వేల్ జనవరి 4 ప్రశ్న ఆయుధం :

శనివారం జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కౌలు రైతులకు,వ్వవసాయ కూలీలకు ఇచ్చిన హమీలు అమలుచేసే విధంగా నిర్ణయాలు తిసుకొవాలని గజ్వేల్ లో నుండి శనివారం నాడు ఒక ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం బుణం,ఇతర ప్రయోజనాలు చేకురే విధంగా అర్హత కార్డులను జారి చేయాలని డిమాండ్ చేశారు. సాగుదారులకు రైతు భరోసా ఇస్తామని చెబుతూనే అసలైన సాగుదారులను గుర్తించక పొవడం కౌలు రైతులను దగచేయడమవుతుందన్నారు.స్వయంగా ముఖ్యమంత్రి 2023 సెప్టెంబర్ 13 న కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలో దాదాపు 40 శాతం కౌలు రైతులే భూమిని సాగుచేస్తున్నారని వీరికొసం 2011 కౌలు రైతులకు కార్డులు ఇచ్చెందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారికి న్యాయం చేస్తామని చెప్పిన హమిని నిలబెట్టుకొవాలన్నారు.రైతు ఆత్మహత్య కుటుంబాలలో 75 శాతం మంది కౌలు రైతులే కాబట్టి వారికి న్యాయం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకొవాలన్నారు. వ్వవసాయ కూలీ భరోసా కొసం ఆర్థిక సంవత్సరానికి 1200 ఇచ్చే పథకానికి ఉపాధి హమీ కూలీలు 100 రోజులు పనిపూర్తిచేసిన వారికే ఇస్తామనే విషయం మిడియా ప్రకటన ద్వారా తెలుస్తున్నందున ఇట్లా చేస్తే చాల కూలీ కుటుంబాలు నష్టపొయే అవకాశమున్నది గనుక జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి,ఎకరం లొపు పెదలకు ఇవ్వాలని, అదే విధంగా రైతు భరోసా 10 ఎకరాల లోపు వారికి వర్థింపచేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా కేబినెట్ లో నిర్ణయాలు తిసుకొవాలని కొరుతున్నమన్నారు.

Exit mobile version