వరంగల్: భద్రకాళి చెరువు వద్ద ఉద్రిక్తత..
*WGL భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువు నీటిని తీయాలని చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. 450 మత్స్యకారుల కుటుంబాలు భద్రకాళి చెరువుపై ఆధారపడి బతుకుతుంటే, ఇప్పుడు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు నీటిని ఎలా తరలిస్తారని అధికారులను మత్స్యకారులు ప్రశ్నించారు.*
*తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.*