పశు వైద్యశాలలో ఉద్రిక్తత

పశు వైద్యశాలలో ఉద్రిక్తత

 అధికారుల జోక్యంతో పరిష్కారం

సిబ్బంది హాజరు లో ఆలస్యం పై రైతుల ఆందోళన 

ఏడీ శ్రీనివాస్ చర్యలతో సమస్య పరిష్కారం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 13 

కామారెడ్డి పశువైద్యశాలలో సోమవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పశు వైద్యశాల సిబ్బంది ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాల వల్ల విధులకు హాజరుకాలేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే, పశు వైద్యశాలలో పనిచేస్తున్న సత్యలింగం అనే ఉద్యోగి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌లో చేరగా, మరో సిబ్బంది ఓఎస్ కిషన్ (అటెండర్) బంధువు మరణంతో అత్యవసరంగా స్వగ్రామానికి వెళ్లారు. ఈ కారణంగా కొంతసేపు సిబ్బంది హాజరులో ఆలస్యమైంది.దీంతో చికిత్స కోసం వచ్చిన రైతులు అసహనానికి గురై ఆసుపత్రి వద్ద స్వల్ప ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తక్షణమే అక్కడికి చేరుకుని అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సేవలు సజావుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, అత్యవసర పరిస్థితుల్లో గోపాలమిత్ర శ్రీనివాస్ (ఫోన్ : 9948163271) ను సంప్రదించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment