*గాంధారి మండల కేంద్రంలో లో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు*
ప్రశ్న ఆయుధం న్యూస్ 02 ఏప్రిల్ కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు బుధవారం నాటికి పూర్తి కావడంతో ఎంఈఓ శ్రీహరి మాట్లాడడం జరిగింది
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి సెంటర్ లో మొత్తం 247 మంది విద్యార్థులకు గాను 246 మంది హాజరు అయినారు. మరియు పోతంగల్ ఉన్నత పాఠశాల సెంటర్ లో 130 మందికి 130 హాజరు అయినారు.ఈరోజుతో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినవి అని వీటిని విజయవంతంగా నిర్వహించిన CS, DO లకు, ఇన్విజిలేటర్స్లకి అభినందనలు అలాగే సహకరించిన పోలీస్, వైద్య ఆరోగ్య సిబ్బందికి మండల విద్యాధికారి వోడపల్లి శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు.