Site icon PRASHNA AYUDHAM

జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.

IMG 20250501 WA2345

*జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.*

సీఎం రేవంత్ రెడ్డి నిన్న టెన్త్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 98.2 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా..రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు అయింది.బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబాబాద్‌ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడవు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్ట్‌ రీకౌంటింగ్‌కు ఐదు వందల రూపాయలు, రీ వెరిఫికేషన్‌కు వేయి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.

Exit mobile version