Site icon PRASHNA AYUDHAM

అమాయకులపై చేసిన ఉగ్రవాదుల దాడి –మానవత్వంపై మచ్చ

IMG 20250430 WA2600

*అమాయకులపై చేసిన ఉగ్రవాదుల దాడి –మానవత్వంపై మచ్చ*

*బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ*

*ఇల్లందకుంట ఏప్రిల్ 30 ప్రశ్న ఆయుధం*

బీసీ సంక్షేమ సంఘం ఇల్లందకుంట మండల అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో భారత సామాన్య పౌరులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి పిరికిపంద చర్యగా అభి వర్ణించారు పహల్గాం ఉగ్రవాద దాడి మానవత్వంపై చేసిన దాడి, మానవుల రూపంలో ఉన్న మృగాలు చేసిన దాడి, ఈ పాశవిక దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఆ ఉగ్రవాద మూకలను వెంటనే గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కి తగిన బుద్ధి చెప్పాలని కేంద్రం ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దాడులు మళ్లీ చేసే ఆలోచన వస్తేనే పాకిస్థాన్ కీ వెన్నులో వణుకు పుట్టే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గడ్డి గోవర్ధన్, పెద్ది కుమార్, అన్నం ప్రవీణ్, గైకోటి రాజు, గందం రవీందర్, పుట్ట శ్రవణ్, రాజేష్, ప్రవీణ్, ఎర్రబాటి శ్రీవకృష్ణ, నికిల్, హరికృష్ణ, సదానందం, నరసయ్య, సాయి, వీరన్న, కారింగుల రాజేందర్, తోడేటి మధుకర్, జంపాల రితీష్, మల్లేష్, ఆరెల్లి కొమురయ్య, దార రవీందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version