బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా లో బుధవారం ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ లు మాట్లాడుతూ నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాల్గహం లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదులు యాత్రికుల పై దాడి చేసేటప్పుడు వారిని హిందువులుగా గుర్తించి హిందువులను మాత్రమే దాడి చేసి చంపి, ప్రధానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు చెప్పడాన్ని ప్రతి హిందువు ఆర్థం చేసుకోవాలని సూచించారు. ప్రాంతాల పేరిట, కులాల పేరిట, భాషల పేరిట హిందువులు విడిపోతే, ఉగ్రవాదులు మాత్రం ఏ ప్రాంతం, ఏ భాష, ఏ కులము అని చూడకుండా కేవలం హిందువులు అయితే చాలు వారిని చంపేశారని ఇకపై అయినా హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఉగ్ర దాడి నీ ఉపేక్షించేది లేదని సాధ్యమైనంత తొందరలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంతకు రెట్టింపు ప్రతీకార దాడులు జరుపుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, నక్సలైట్ల ను అణిచివేయటానికి పక్కా ప్రణాళిక తో ముందుకు పోతుందని, కాంగ్రెస్ మరియు కొన్ని ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అయినప్పటికీ త్వరలోనే భారత దేశంలో ఉగ్రవాదులను తుదముట్టిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, నరేందర్, సంతోష్ రెడ్డి, సురేష్, ప్రవీణ్, మహేష్, రాజేష్, భూమేష్, రాజ గోపాల్, బలమని, గుణేందర్, లక్ష్మిపతి, రవీందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.