తెవివి పేరు మార్పు తగదు.
– పేరు మార్చే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.
– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు,తెవివి పూర్వ అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం పేరును మార్చి ఈశ్వరీబాయి యూనివర్సిటీగా మార్చాలనే ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.ఉన్నత విద్యామండలి నుండి వచ్చిన ప్రతిపాదనను వర్సిటీ అధికారులు తిరస్కరించాలన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మాదిరిగా తెలంగాణలో కూడా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రజల కోరిక మేరకు విశ్వవిద్యాలయానికి తెలంగాణ పేరు పెట్టారని గుర్తు చేశారు.సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరుతో ఏర్పడిన తెవివి పేరు మారిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నో ఉద్యమాలతో ఏర్పడిన యూనివర్సిటీ 500 పై చిలుకు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్లో ప్రతీసారి యూనివర్సిటీ కి అరకొర నిధులు కేటాయిస్తూ మొండి చేయి చూపిస్తున్నారు, ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ పేరుని మార్చి దాని ఉనికిని పోగేట్టే చర్యలు మానుకోవాలని,అధిక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, రంజిత్, సత్యం, మధు, అరవింద్,దరాంసింగ్, ఈశ్వర్,శ్రీరామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.