సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 37.40 కోట్ల రూపాయల నిధుల మంజూరు అయినట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు కలిపి రూ.37.40 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, ఈ నిధులు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు విడుదల చేస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.18.70 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటీకి రూ.18.70 కోట్లు మంజూరు కాగా, త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.
*సదాశివపేట మున్సిపాలిటీలో..*
*ఊబ చెరువు సుందరీకరణకు ₹1.50 కోట్లు.
*గాంధీ చౌక్ సుందరీకరణకు ₹50 లక్షలు.
*అయ్యప్ప టెంపుల్ నుండి పి.ఎస్.ఎమ్.ఎల్ వరకు సెంట్రల్ మీడియన్, లైటింగ్ కోసం ₹1.60 కోట్లు.
*డబుల్ బెడ్‌రూమ్ హౌజింగ్ పరిసరాల్లో కనీస సదుపాయాల అభివృద్ధికి ₹50 లక్షలు.
*మున్సిపాలిటీ పరిధిలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు కోసం ₹30 లక్షలు.
*గురు నగర్ కాలనీలో పార్క్ అభివృద్ధికి ₹50 లక్షలు.
*సంగారెడ్డి మున్సిపాలిటీలో..*
*విలీనం చేసిన గ్రామాల్లో సి.సి. రోడ్ల నిర్మాణానికి ₹2 కోట్లు.
*పట్టణ పరిధిలో ఇంటర్నల్ సి.సి. రోడ్ల నిర్మాణానికి ₹8.26 కోట్లు.
*వరద నీరు మళ్లింపు కోసం ప్రత్యేక డ్రైన్‌ల నిర్మాణానికి ₹5.09 కోట్లు.
*పార్కుల అభివృద్ధికి ₹1.35 కోట్లు.
*సంగారెడ్డి పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ₹2 కోట్లు మంజూరయినట్లు వారు తెలిపారు.