కష్ట పడి పండించిన పంటను దళారులకు అప్పగించొద్దు: టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి, కంది మండలాలలో వనకాలం వడ్ల కొనుగోలు కేంద్రాలను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రైతు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అప్పగించొద్దని, తెలంగాణ ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఇస్తుందని, ఏ గ్రేడ్ రూ.2389, సాధారణ రకం గ్రేడ్ రూ. 2369, సన్నవడ్లకు రూ.2389 బోనస్ రూ.500, మొత్తం రూ.2889గా ఇస్తుందని తెలిపారు. కావున ప్రతి ఒక్క రైతు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు. బోనస్ కు కావలసిన పత్రాలు, కొత్త పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్,ప్రభాకర్ రెడ్డి, తాళ్లపల్లి మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ హషం, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now