సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసీ ప్రాజెక్టులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) నిమ్జ్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సంగారెడ్డి, జహీరాబాద్ డివిజన్ లో జరుగుతున్న టీజీఐఐసీ, నిమ్జ్ భూసేకరణ పనులపై ఆయా డివిజన్ లో ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, టీజీఐఐసీ అధికారులు, నిమ్జ్ అధికారుల తో భూ సేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు. నిమ్జ్ ప్రాజెక్టు మొదటి దశ ఏర్పాటు కోసం టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 1501 ఎకరాల భూమి సేకరణ జరిపి నిమ్జ్ అధికారులకు అప్పగించినట్లు మిగిలిన భూమిని సైతం త్వరలో నిమ్జ్ కు అప్పగించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. టిజీఐఐసి ప్రగతి నివేదిక త్వరలో సమర్పించనున్నట్లు తెలిపారు. ఆలోపు భూసేకరణ పనులు వేగవంతం అయ్యేలా రెవెన్యూ,టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణకు అవసరమైన నిధుల అంశాన్ని టీజీఐఐసీ ద్వారా తక్షణం చెల్లించేలా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూ సేకరణకు నిధుల కొరత లేదని తెలిపారు. ఇప్పటి వరకు టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పరిహారం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి , సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీవోలు, టీజీఐఐసీ ప్రతినిధులు, నిమ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
టీజీఐఐసీ, నిమ్జ్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288