Site icon PRASHNA AYUDHAM

టిజిటిఏ పోరాట ఫలితంతో మెస్ కాస్మెటిక్ చార్జీల పెంపు

*టిజిపిఏ పోరాట ఫలితంతో మెస్ కాస్మెటిక్ చార్జీల పెంపు*
*మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంపుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీజీపీఏ రాష్ట్ర కమిటి*

*కరీంనగర్ నవంబర్ 1 ప్రశ్న ఆయుధం::-*

తెలంగాణ గురుకుల పేరెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం నేడు మెస్ కాస్మెటిక్ చార్జీల పెంపు చేపట్టడం జరిగిందని టిజిపిఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మోతుకూరు యాదయ్య అన్నారు సెప్టెంబర్ 9 రోజున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ వేదికగా తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థిని విద్యార్థుల పేరెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మోతుకూరు యాదయ్య మాట్లాడుతూ గురుకులాల సమస్యలను పరిష్కరించాలనీ,బోధన,బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరణ చేయాలనీ పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ పెండింగ్ జీతాలు కాంట్రాక్ట్ బిల్లులు నిరుపేద పిల్లల కాస్మోటిక్ డైట్ చార్జెస్ పెంచాలని పై పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనము మెరుగైన వైద్యం మౌలిక సదుపాయాలు విద్యార్థులకు అందించాలని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని ప్రభుత్వం పెంచిన మెనూ క్యాటరింగ్ ,కాస్మోటిక్ చార్జీలు అమలు చేయడం తో విద్యార్థులు తల్లిదండ్రులు టీజీపీఏ సంఘం కృతజ్ఞతలు తెలిపారు అలాగే మిగతా బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు పది నెలలగా గురుకులాల్లో రకరకాల కారణాలతో చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వం పది లక్షల ఎక్స్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు దార మధు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె పవన్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్ర లావణ్య, సభ్యులు యాకయ్య పాల్గొన్నారు.

Exit mobile version