తెలంగాణ బంద్ కి టిజీవిపి పూర్తి మద్దతు….   

తెలంగాణ బంద్ కి టిజీవిపి పూర్తి మద్దతు….              ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17 (భిక్కనూర్)

రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు ప్రారంభించబోయే 42 శాతం బీసీ రిజర్వేషన్ కొరకు “తెలంగాణ బంద్” కు తెలంగాణ విద్యార్థి పరిషత్ పూర్తి మద్దతు ప్రకటించిందని టిజివిపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని టీజీవిపి విద్యార్థి పరిషత్ కోరుకుంటోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీజీవిపి బిక్కనూర్ మండల ప్రెసిడెంట్ భరత్ రాజ్, ధనుష్, రాహుల్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now