ధర్మారెడ్డి రైతుల కృతజ్ఞతలు
త్వరితగతిన ధాన్యం కొనుగోలు
–సకాలంలో చెల్లింపులతో రైతుల ముఖాల్లో వెలిగిన ఆనందం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 19
బుధవారం:
నూతన కొనుగోలు సీజన్ ప్రారంభమైన నెలలోపే ధాన్యం కొనుగోలు పూర్తిచేసి, రైతుల ఖాతాల్లో పూర్తిస్థాయి చెల్లింపులు జమ చేయడం పట్ల ధర్మారెడ్డి గ్రామ రైతులు జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా వేగవంతంగా ధాన్యం సేకరణ జరగడం, రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యాన్ని ఒక గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు చేయడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
సకాలంలో చెల్లింపులు రావడంతో తమకు పెద్ద ఉపశమనంగా మారిందని రైతులు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో గ్రామ రైతులు చూపిన సహకారాన్ని కలెక్టర్ ప్రశంసించారు. రికార్డు స్థాయిలో పనితీరు చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టడంలో ముఖ్యపాత్ర పోషించిన ఐకేపీ సీసీ ఇన్చార్జి కొమ్మ దత్తు, కేంద్ర సిబ్బంది, మహిళా సమాఖ్య కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఏపీఎం రామ్ నారాయణ గౌడ్, రైతులు నారాయణ, దేవయ్య, సాయిబాబా, U. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారెడ్డి రైతుల కృతజ్ఞతలు
by Peddi Venu
Published On: November 19, 2025 8:43 pm