గ్రామానికి నిధులు మంజూరు చేయించిన ఆవుల రాజిరెడ్డి, నవీన్ గుప్తాలకు కృతజ్ఞతలు

మెదక్/నర్సాపూర్, జనవరి 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ నియోజకవర్గంలోని పిల్లుట్ల గ్రామానికి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు నవీన్ గుప్తా సహకారంతో (ఎంజీఎన్ఆర్ జీఈజీఎస్) నిధుల నుంచి అంగన్ వాడి భవనం, సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, యువ నాయకుడు బుర్ర మురళి గౌడ్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పిలుట్ల గ్రామంలో (ఎంజీఎన్ఆర్ జీఈజీఎస్) నిధుల నుంచి అంగన్ వాడి భవనానికి 8 లక్షలు, సీసీ రోడ్డుకు 5 లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు నవీన్ గుప్తాలకు పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడాల ప్రభు, సండ్ర లక్ష్మయ్య, బెస్త కృష్ణయ్య, బండారి నగేష్ బెస్తా ముత్యాలు, గుర్రాల బాలేష్, పిల్లి మధు, బొమ్మిడాల శంకర్, పెద్దపులి సతీష్, బాసంపల్లి నరసింహులు, గొల్ల స్వామి, దినేష్, గాండ్ల ఆంజనేయులు, కమ్మరి వినయ్, పిల్లి సుధాకర్, బుర్ర వినయ్, సండ్ర విష్ణు, బెస్త శ్రీకాంత్, మస్కురి కన్నయ్య, బబ్బురి శివ, పిల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now