ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 9(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మైసయ్య యాదవ్ తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు 50% రుణమాఫీ జరిగినట్టు ఆయన అంచనా వేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.