ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు అక్క మల్ల మైసయ్య యాదవ్ అన్నారు. శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దని, ఏవైనా సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులు పరిష్కరిస్తారని అన్నారు.