పసుపు బోర్డు ఏర్పాటుపై వినూత్నంగా కృతజ్ఞతలు.

పసుపు బోర్డు ఏర్పాటుపై వినూత్నంగా కృతజ్ఞతలు.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 15

IMG 20250115 WA0036

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడంలో విశేష కృషి చేసిన ఎంపీ అర్వింద్‌కు ఓ యువతి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపింది. నగరంలోని బోర్గాం(పి)కి చెందిన ఫొటోగ్రాఫర్‌ మల్లేశ్‌ కుమార్తె చిన్నకరి భవాని కోటగల్లీలోని జూనియర్‌ కళాశాలలో సెకండియర్‌ చదువుతోంది. పసుపు బోర్డు జిల్లాకు వచ్చిన సందర్భంగా అర్వింద్‌కు అభినందనలు తెలుపుతూ ముగ్గు వేసింది. అలాగే జాతీయ పసుపు బోర్డుకు జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించడంపై ముగ్గులో హర్షం వ్యక్తం చేసింది. ఈ ముగ్గును స్థానిక బీజేపీ నాయకుడు యాదాల నరేశ్‌ ఇంట్లో వేయగా ఎంపీ అర్వింద్‌ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now