Site icon PRASHNA AYUDHAM

వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన సభ్యులకు ధన్యవాదాలు

IMG 20240722 WA1521

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన టీ జే యూ సభ్యులకు ధన్యవాదాలు టీ జే యూ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి .కంది.చంద్రకళ రెడ్డి* ప్రశ్న ఆయుధం 22జులై /మోట కొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రదానం అని పెద్దలు చెప్పిన మాట ప్రకారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ కేంద్రంలోని సుమంత్ కంటి హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి టీ జే యూ ప్రతినిధులు విచ్చేసి కంటి వైద్య నిపుణుల పర్యవేక్షణలో కండ్ల పరీక్షలు చేపించుకుని మందులు , అద్దాలు తీసుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా టీ జే యూ కుటుంబ సభ్యులకు , టీ జే యూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు కి , జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబాకి ధన్యవాదాలు తెలిపారు .

Exit mobile version