రెవిన్యూ శాఖ మంత్రి కి కృతజ్ఞతలు..

నూతన ROR చట్టం 2024 చర్చా వేదికలోముఖ్య అతిథిగా విచ్చేసిన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెవెన్యూ శాఖ  రద్దయిన గ్రామ రెవెన్యూ అధికారులను మరల గ్రామానికి ఒక అధికారి ని నియమిస్తాము అని హామీ ఇవ్వడం అర్షనీయంఅద్భుతమైన ఆలోచనతో tresa రథసారథి వంగ రవీందర్ రెడ్డి  ఏర్పాటుచేసిన నూతన ROR చట్టం చర్చ వేదికలో ఆయన మాట్లాడుతూ రద్దయిన ప్రతి ఒక్క విఆర్ఓ ను ఎలాంటి షరతులు లేకుండా వారి యొక్క అనుభవమే క్వాలిఫికేషన్ గా తీసుకొని రెవెన్యూ శాఖలో నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థలో అధికారిగా నియమించాలని మంత్రి  విజ్ఞప్తి చేయడం జీవితంలో మరువలేని ఘట్టం..డిప్యూటీ కలెక్టర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రమోహన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో వీఆర్వోలు చాలా కీలకం వారు లేనిది రెవెన్యూ యంత్రాంగం పనిచేయదని నిక్కచ్చిగా మాట్లాడుతూ రద్దయిన ప్రతి ఒక్క విఆర్ఓ ను రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి గ్రామ రెవెన్యూ వ్యవస్థలో వారి సర్వీసులు ఉపయోగించుకోవాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేయడము సంతోషకరమైన విషయం.గౌతమ్ కుమార్ గారు TRESA ప్రధాన కార్యదర్శి. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన ప్రతి ఒక్క విఆర్ఓ ను తీసుకువచ్చి వారి యొక్క అనుభవాన్ని రెవెన్యూ శాఖకు ఉపయోగించుకోవాలి వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం మరువలేని అంశం. భూమి సునీల్  మాట్లాడుతూ చట్టం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని చట్టం అమలులో నిమగ్నమై నియమ నిబద్ధతతో ఆ చట్టాన్ని అమలు చేస్తే రైతన్ననికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అదేవిధంగా చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని క్లుప్తంగా రెవెన్యూ ఉద్యోగులకు మరియు ప్రజలకు వివరించడం జరిగినది.గోల్కొండ సతీష్ చైర్మన్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో పనిచేయడం చాలా అదృష్టకరమని భూమిని పరిపాలించే శాఖలో మనిషి జన్మించినప్పటి నుండి చనిపోయేంతవరకు వారికి అవసరమైనటువంటి ధ్రువపత్రాలను అనగా జననం నుంచి మరణం వరకు వారికి కావలసిన అన్ని రకాల ధ్రువపత్రాలతో పాటు వారి భూరక్షణతో పాటు ఇతర ఇతర సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పించే శాఖ రెవెన్యూ శాఖ ఇలాంటి శాఖలో ఉద్యోగం చేయడము చాలా అదృష్టకరమని అదే విధంగా ఇతర శాఖలో ఉద్యోగులతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసే ఉద్యోగికి బీపీలు షుగర్లు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని నూతన ఆర్ఓఆర్ చట్టం 2024. రూపకల్పన చేసి ప్రజాస్వామిక బద్ధంగా ప్రజల ద్వారా వారి సలహాలు తీసుకొని చట్టాన్ని చేయడం అనేది దేశంలో మొదటిసారి అని, ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలను అమలు జరపాలంటే రెవెన్యూ శాఖలో ఉద్యోగుల యొక్క సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం మరియు మండల స్థాయిలో ఉద్యోగులు లేక కేవలం ఒక ఆర్ఐ మండలానికి ఉండడం వలన ఆ మండల స్థాయిలో 20 నుండి 30 గ్రామాలు ఉండటం వలన పని ఒత్తిడికి గురవుతున్నారని పని ఒత్తిడికి విముక్తి చెందాలంటే గ్రామస్థాయిలో రద్దయిన గ్రామ రెవెన్యూ అధికారులను మరల రెవెన్యూ శాఖలోకి ఎలాంటి షరతులు లేకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేయడం జరిగినది.. జనరల్ హరాలే సుధాకర్ రావు  మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి రెవెన్యూ శాఖలో సేవలందించిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు పరచడం వలన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ప్రజలతో పాటు రద్దయిన వీఆర్వోలు అనేకమైన సమస్యలతో శతమవుతూ ఇతర శాఖలో ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఎలాంటి షరతులు లేకుండా నూతనంగా రూపుదిద్దబోతున్న గ్రామ రెవెన్యూ వ్యవస్థలో రద్దయిన ప్రతి ఒక్క గ్రామ రెవెన్యూ అధికారిని తీసుకువచ్చి వారి యొక్క సర్వీసుని ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరడం జరిగినది..కనివిని ఎరుగని రీతిలో నూతన ఆర్ ఓ ఆర్ చట్టం 2024 చర్చ వేదికలో పాల్గొన్న న్యాయ నిపుణులు న్యాయవాదులు విశ్లేషకులు ఇంటలెక్చువల్సు మేధావులు పారిశ్రామికవేత్తలు న్యాయ నిపుణులు యావత్తు తెలంగాణ రాష్ట్రం నుండి రెవెన్యూ శాఖను శాఖ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్స్ తాసిల్దారుసు డిప్యూటీ తాసిల్దారుసు సీనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ మరియు రెవెన్యూ శాఖలో కొనసాగుతున్నటువంటి వీఆర్వోలతో పాటు ఇతర శాఖలోకి వెళ్లిన మాజీ విఆర్వోలు మహిళా ఉద్యోగులు మహిళా నాయకురాలు అదేవిధంగా గ్రామ రెవెన్యూ సహాయకులు గ్రామ రెవెన్యూ సహాయకుల నుండి పదోన్నతి పొందిన జూనియర్ సహాయకులు అశేషమైన ఉద్యోగుల మధ్యలో… గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరల పునరావృతం చేయాలని ఏకాభిప్రాయంతో చప్పట్లతో హోరెత్తిచ్చిన చర్చా వేదిక సభను హర్షించిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కృతజ్ఞతలు..ఇట్టి కార్యక్రమంలో అన్ని క్యాడర్ల రెవెన్యూ ఉద్యోగులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు .పల్లెపాటి నరేష్,కాందారి బిక్షపతి, ప్రతిభ, చింతల మురళి, పగిల్లవెంకన్న,, రామ్ చందర్ వరంగల్, శ్రీనివాస్ జనగాం,తిరుపతి జగిత్యాల్, పరుశురాం జనగాం, రాము. అంజనీ కుమార్ సంగారెడ్డి, రాష్ట్ర జిల్లా జేఏసీ నాయకులు పాల్గొన్నారు..

 

 

 

Join WhatsApp

Join Now