ఆ భూమి ముమ్మాటికి HCU కి చెందినదే
400 ఎకరాలకు బదులు గోపనపల్లిలో భూమి ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో సెల్ఫ్ గోల్ వేసుకుంది
HCU లో 400 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఆనాటి ప్రభుత్వం 2004 లో గోపనపల్లిలో 397 ఎకరాలను కేటాయించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది
ఆ 400 ఎకరాలు HCU కి చెందినవి కాకపోతే ప్రత్యామ్నాయ భూమి ఎందుకు కేటాయించిందనే అంశం చర్చనీయాంశంగా మారింది
ఆనాడు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి HCU భూములు కేటాయించినప్పుడు, విద్యార్థులు నిరసన తెలిపితే గోపనపల్లిలో 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు కానీ వైఎస్సార్ హయాంలో గోపన్నపలిలోని 397 ఎకరాల్లో 200 ఎకరాలను టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కేటాయించారు
1974 నుండి 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా భూమిని HCU పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడమే రేవంత్ రెడ్డికి కలిసివచ్చింది
భూముల విషయంలో టీజీఐఐసీ చేసిన ప్రకటనలు అవాస్తవం అని, HCU లో ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదని, ఎలాంటి భూ బదిలింపులకు HCU ఒప్పుకోలేదని వైస్ రిజిస్ట్రార్ స్పష్టం చేశాడు…