అంత మా ఇష్టం…?

బోధన్ ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా పుస్తకాల విక్రయం

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

ప్రైవేట్ లో ఫీజుల నియంత్రణ కరువు

నిబంధనలకు తూట్లు

ప్రశ్న ఆయుధం 25 జూలై(నిజామాబాద్ బ్యూరో):

బోధన్ పట్టణం అంటేనే ప్రైవేట్ పాఠశాలలకు అడ్డగా మారిందని, విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి,దర్జాగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయం,యూనిఫాంలు ఆఖరుకు కాళ్లకు వేసుకునే బూట్లను సైతం ప్రైవేటు పాఠశాలలో విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం చలనం లేకుండా పోతుంది.ప్రైవేట్ స్కూల్లో జరిగే బాగోతాలపై ఆఖరుకు అసెంబ్లీలో సైతం చర్చ జరగడం కోసం మెరుపు.అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నా,అర్హత ఉన్న వారి సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని ఈ తతంగం కొనసాగిస్తున్నారని సమాచారం.ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ,ప్రవేట్ యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా విద్యా బోధన కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు కొనసాగిస్తున్నా ఇటు వైపు సంబంధిత ఉన్నతాధికారులు ఎవరు పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోధన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై సంబంధిత ప్రత్యేక టీం ద్వారా పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు బహిర్గతం అవుతాయి. ధనార్జన్యే ధ్యేయంగా విద్యా సంస్థలను కొనసాగిస్తున్న వారిపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,పేద,మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని బోధన్,పరిసర ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Join WhatsApp

Join Now