సత్యనారాయణ కాలనీలో దేవాలయాల 17వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ

సత్యనారాయణ కాలనీలో దేవాలయాల 17వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహణ

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 31

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీ 17వ వార్డులో గల శ్రీ సాయిబాబా గుడి, శ్రీ పోచమ్మ దేవస్థానం, శ్రీ భవాని శంకర స్వామి దేవస్థానం, శ్రీ రమ రహిత సత్యనారాయణ స్వామి దేవస్థానాల 17వ వార్షికోత్సవాలు శ్రద్ధాభక్తులతో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, అన్నం రాజు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్షికోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. గుడి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, “కాలనీలోని దేవాలయాలు సుందరంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఇది ప్రతి ఒక్కరి సహకార ఫలితం” అని అన్నారు. అనంతరం గుడి కమిటీ సభ్యులు అతిథులను సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now