కీసరలో ఘనంగా 186వ జ్ఞానమాల కార్యక్రమం

కీసరలో ఘనంగా 186వ జ్ఞానమాల కార్యక్రమం

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఆగస్టు 31

కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే జ్ఞానమాల కార్యక్రమం 186వ వారం ఆదివారం రోజున ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కీసర మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుడుం ఆగమయ్య మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప మేధావి అని కొనియాడారు. ఆయన ఆశయాలను అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ప్రోత్సహిస్తూ, క్రీడల్లోనూ రాణించేలా మార్గనిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బలిదే రమేష్ గుప్తా, కీసర గుట్ట ఫౌండర్ ట్రస్టీ తటాకం రమేష్ శర్మ, శ్రీ కీసర బంగారు మైసమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ తుడుం యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుంటోళ్ళ సత్యనారాయణ, మాజీ వార్డ్ సభ్యులు శీలం మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు కర్రె బలమని, బిఆర్ఎస్ పార్టీ కీసర గ్రామ శాఖ అధ్యక్షులు చినింగిని బాల్ రాజ్తో పాటు పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment