*ఘనంగా చత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు*
*
*పోలీస్ ఆంక్షలు మధ్య చత్రపతి శివాజీ జయంతి వేడుకలు*
*అరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మహేందర్ రాష్ట్ర నాయకులు అదర్ సండే నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు రామారావు*
జమ్మికుంట ఫిబ్రవరి 19 ప్రశ్న ఆయుధం
హిందూ ధర్మ రక్షకుడు పర స్త్రీని తన తల్లిగా భావించే మహా యోధుడు శ్రీ చత్రపతి శివాజీ జయంతి వేడుకలను మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు దీనికి పోలీస్ వ్యవస్థ ఆంక్షలుతో కూడిన సంబరాలను అనుమతించారని రాష్ట్ర నాయకుడు అదర్ సండే నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు రామారావు పేర్కొన్నారు మండల కేంద్రంలోని విగ్రహానికి జమ్మికుంట మండలంలో విలాసాగర్ పాపయ్యపల్లి వెంకటేశ్వర్ల పల్లె మడిపల్లి సైదాబాద్ పాపక్కపల్లి గ్రామాలలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాల వేసి నిడరాంబరంగా ఉత్సవాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ చిన్నప్పటినుండే యుద్ధ విద్యలలో చక్కటి ప్రతిభను ఘనపరిచేవాడని తన తల్లి ప్రేరణతో యుద్ధ విద్యలు నేర్చి సామ్రాజ్యాన్ని స్థాపించారని సామ్రాజ్య స్థాపనలో గెరిల్లా యుద్ద నీతిని ఉపయోగించాడని పరమత స్త్రీల పట్ల చాలా గౌరవంగా ఉండేవాడని పర స్త్రీని తల్లిగా భావించే మహాయోధుడని హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడిన ఏకైక చక్రవర్తి అని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చత్రపతి శివాజీ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడుతున్న అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం శివాజీ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని శివాజీ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు మహేందర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బామండ్లపల్లి శివన్న అంబరగొండ బాపూరావు ఇంగిలే ప్రభాకర్ రవి రాజు రమేష్ కిషన్ కృష్ణమూర్తి భుజంగరావు రవి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.