*సరస్వతీ నది, మహాభారత కాలంనాటి ఆనవాళ్లు.. రాజస్థాన్‌లో 4,500 ఏళ్ల నాటి నాగరికత వెలుగులోకి!*
బయటపడ్డ ఋగ్వేద కాలం నాటి సరస్వతీ నది పురాతన ప్రవాహ మార్గం
మహాభారత కాలంతో పాటు ఐదు వేర్వేరు యుగాలకు చెందిన ఆధారాలు లభ్యం
800కు పైగా పురావస్తు కళాఖండాలు, అరుదైన ఎముకల పనిముట్లు లభ్యం
భారత చరిత్ర పుటల్లో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన తవ్వకాల్లో సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి పురాతన నాగరికతకు సంబంధించిన అద్భుతమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నదికి సంబంధించిన పురాతన ప్రవాహ మార్గం (పేలియో ఛానల్) బయటపడటం చారిత్రక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో ఈ ఏడాది జనవరి 10న ఏఎస్ఐ తవ్వకాలను ప్రారంభించింది. సుమారు 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనలు, రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా నిలిచాయి. ఇక్కడ బయటపడిన ప్రాచీన నదీ ప్రవాహ మార్గం, ఒకప్పుడు సరస్వతీ నదీ వ్యవస్థలో భాగమై ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నదీ తీరంలోనే తొలినాట