*హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*
*ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు*
*హుజురాబాద్ జనవరి 26 ప్రశ్న ఆయుధం*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రతి సంవత్సరం జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, 1947 ఆగష్టు 15న మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని చేయడం జరిగిందని భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2. సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని అప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చిందని అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయని ఇంత స్వేచ్ఛగా, ధైర్యంగా బతకడానికి మనదేశ సైనికులు మనదేశ స్వాతంత్య్ర పోరాట ధీరులు ముఖ్య కారణం అని తెలియజేశారు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి తేజ, నగర సంయుక్త కార్యదర్శిలు విజయ్, హరీష్, అనురాగ్, నగర ఉపాధ్యక్షులు రామ్ చరణ్ , అంజి, బిట్టు, రాయుడు . నగర హాస్టల్స్ కన్వీనర్ పెరుగు అభిలాష్, కో కన్వీనర్ చిన్న జస్వంత్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు .