బాల్కొండ లో ఘనంగా బహుజన రాజకీయ యుద్ధ వీరుడు కాన్షీరాం 91వ జయంతి వేడుకలు.
ప్రశ్న ఆయుధం మార్చి 15: బాల్కొండ మండల కేంద్రంలో DSP రాష్ట్ర కమిటీ అదేశాలమేరకు DSP మార్గధాత మాన్యశ్రీ కాన్షీరాం 91వ జయంతి కార్యక్రమన్నీ DSP మండల కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి,కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షులు నిశాంత్ గారు మాట్లాడుతూ ఫూలే, అంబేద్కర్ ఉద్యమ రథ సారథి, అంబేద్కర్ ఉద్యమానికి ఆచరణాత్మకవాది కాన్షీరాం అని, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు,ఆయన పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో DSP అధినేత డా.విశారదన్ సార్ గారు కొనసాగిస్తున్నారు అని తెలిపారు.మన ఓట్లు మనమే వేసుకొనే చైతన్యం ప్రజల్లో రావాలి అని,కాన్షీరాం సార్ కి మరో రూపమే విశారదన్ సార్ అని,అలాగే ధర్మ సమాజ్ పార్టీ 2వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళి,మండల నాయకులు రంజీత్,సాయి,క్రాంతి కిరణ్,ప్రవీణ్,అనిల్,ప్రణయ్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.