మహిళపై హత్యయత్నం కేసులో నిందితుడికి జైలు శిక్ష
— జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 30
*నేరస్థుడు ఎంతటి వారైనా… ఎక్కడికి వెళ్లినా చట్టం వలయం నుండి తప్పించుకోలేరు*
*• మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష మరియు 100 రూపాయల జరిమానా*
మాచారెడ్డి మండలంలోని నెమ్మిలిగుట్ట తండాకు చెందిన జెరుపుల నవీన్ (వయస్సు: 24) తన వదిన జెరుపుల సంకి, వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని, అనుమానంతో 2017 ఫిబ్రవరి 24న మాంసం కోసే కత్తితో ఆమెను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నం: 34/2017, సెక్షన్ 307 IPC కింద నమోదు చేసి, నిష్ణాతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడిని కోర్టుకు హాజరు పరిచారు.
ఈ కేసులో 2023లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, కామారెడ్డి నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష మరియు ₹100 జరిమానా విధించింది. అనంతరం నిందితుడు జిల్లా కోర్టులో అప్పీల్‌కు వెళ్లగా, సోమవారం రోజున జిల్లా న్యాయమూర్తి CH. VRR వర ప్రసాద్ విచారణ అనంతరం నిందితుడికి సీనియర్ సివిల్ జడ్జి 2023 శిక్ష మూడేళ్ల జైలు శిక్షతో పాటు ₹100 జరిమానా సరైనదే అంటూ తీర్పునిచ్చారు.
సరియగు పద్ధతిలో కేసు విచారణ చేసి పకడ్బందీ ఆధారాలతో నిందితునిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కావున ఇట్టి కేసులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, కామారెడ్డి ఇచ్చిన తీరుపై అప్పీల్‌కు వెళ్ళినప్పటికీ, శిక్ష సరైనదే అని జిల్లా న్యాయమూర్తి తమ తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో బాధితురాలు కు న్యాయం జరగడానికి కృషి చేసిన దర్యాప్తు అధికారులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS అభినందించారు.