అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించటమే దీపావళి పండుగ లక్ష్యం
బౌద్ధమత అభిమాని అంగోత్ మంగీలాల్
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో ఘనంగా బౌద్ధ దీపావళి వేడుకలు
అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించటమే దీపావళి పండుగ లక్ష్యమని మణుగూరుకు చెందిన బౌద్ధమత అభిమాని అంగోత్ మంగీలాల్ అన్నారు.సోమవారం రాత్రి స్థానిక శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో మంగీలాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన దీపావళి పండుగ వేడుకల సందర్భంగా ఆయన విద్యార్థులనుదేశించి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా బుద్ధుని ప్రతిమకు ఇరువైపులా దీపాలను ఎంతో అందంగా అలంకరించారు విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బౌద్ధమతంలో దీపావళిని ‘ధర్మ దీపావళి’ లేదా బుద్ధ దీపావళి’ అని పిలుస్తారనీ, ఇది జ్ఞానం, ప్రజ్ఞ మరియు కరుణకు ప్రతీక. బౌద్ధులుజరుపుకుంటారన్నారు.హిందూ దీపావళి: హిందూ మతంలో దీపావళిని ముఖ్యంగా లక్ష్మీ పూజతో ముడిపెడతారు మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన రోజును కూడా నరక చతుర్దశిగా జరుపుకుంటారు.బౌద్ధ దీపావళి: బౌద్ధమతంలో ఇది జ్ఞానం మరియు కరుణ వంటి బౌద్ధ సిద్ధాంతాలకు సంబంధించినదిగా పరిగణిస్తారు. బౌద్ధ దీపావళి అనేది ఆధ్యాత్మిక చింతన,జ్ఞానం మరియు కరుణ వంటి విలువలను ప్రోత్సహించే ఒక పండుగ. ఇది కేవలం ఒక పండుగగా కాకుండా, బౌద్ధ సిద్ధాంతాలను మన జీవితంలోకి ఆహ్వానించడానికి ఒక అవకాశంగా భావించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా,మంగీలాల్
కుటుంబ సభ్యులు అనసూర్య, టాటా లాల్, పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.