రైతును రాజు చెయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సీతక్క

గోదావరి జలాల ద్వారా ములుగు నియోజకవర్గాన్ని షష్యశమలం చేస్తాం.

రైతును రాజు చెయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యం..

మంత్రి సీతక్క

ఏటూరునాగారం(ములుగు) డిసెంబర్25 ప్రశ్న ఆయుధం   :

ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు జంగాల పల్లి బంజరు చెరువుకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కఈ సందర్భంగా మాట్లాడుతూ

గత ప్రభుత్వం నిర్లక్షం మూలన

ములుగు నియోజక వర్గానికి చుక్క నీరు ఇవ్వకుండా సిద్దిపేట సిరిసిల్లకు నీళ్లను

తరలించుకుపోయారు అని

మంత్రి సీతక్క అన్నారు

రాబోయే రోజుల్లో ములుగు పంపు హౌస్ నుండి కొత్త గూడ గంగారాం మండలాలకు గోదావరి జలాలు అందించి ఆ రైతాంగాన్ని ఆదుకుంటామని రెండు పాటలకు నీళ్లను అందిస్తామని త్వరలోనే పంపు హౌస్ నుండి కాశిం దేవిపేట మీదిగా కేనాయిల్ ద్వారా లక్నవరం కు నీళ్లను పంపింగ్ చేసుకోవడం జరుగుతుంది అని రైతులను రాజులుగా చెయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వర్యులు సీతక్క అన్నారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాణోత్ రవి చందర్ తో పాటు అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now