Site icon PRASHNA AYUDHAM

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

IMG 20251019 205155

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ సహ వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళిదర్ జి

వేములవాడ అక్టోబర్ 19 ప్రశ ఆయుధం

ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆదివారం రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వేములవాడ ఖండ ఆధ్వర్యంలో విలాసాగర్ గ్రామ పురవీధుల గుండా పథసంచలన్ కార్యక్రమం జరిగింది.అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో జరిగిన సమావేశానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దావులూరి మురళిదర్ జీ పాల్గొని స్వయం సేవకులకు మార్గదర్శనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ 1925లో విజయదశమి రోజున ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని తెలిపారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలన్నారు ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విలాసాగర్ ఉపమండల, పరిసర గ్రామాల స్వయం సేవకులు వివిధ సంఘ క్షేత్రాల కార్యకర్తలు పాల్గొన్నారని ఖండ కార్యవాహ కొండం పుల్లారెడ్డి తెలిపారు.

Exit mobile version