ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి…..
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సేవా దృక్పథం పనిచేసి మంచి పేరు గడించాలి…
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ..
రాహుల్ ఫార్మసీ మరియు పాలీ క్లినిక్ ను ప్రారంభించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోలిదొడ్డి మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రాహుల్ ఫార్మసీ మరియు పాలీ క్లినిక్ ను ‘ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా హాస్పిటల్స్ పనిచేయాలని అన్నారు. తదంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సేవా దృక్పథంతో మంచి వైద్యాన్ని అందుబాటు ధరలో అందిస్తూ పేరు గడించాలన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అధునాతన హంగులతో ఈ రాహుల్ ఫార్మసీ మరియు పాలీ క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ రాహుల్, నీలిమ, విద్య యాదవ్, నితిన్ యాదవ్, రాజేంద్ర, గోపాల కృష్ణ , మల్లికార్జున, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కాలనీ వాసులు,స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు