అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్‌సర్‌లో విమానం ల్యాండింగ్‌!

*అమెరికా నుంచి భారతీయుల గెంటివేత.. 205 మందితో అమృత్‌సర్‌లో విమానం ల్యాండింగ్‌!*

అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది ట్రంప్‌ సర్కార్‌.

చరిత్రలోనే తొలిసారిగా మిలటరీ విమానాల్లో అక్రమ వలసదారులను, వారివారి దేశాలకు తరలిస్తోంది.

ఈ డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా లేటెస్టుగా 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది.

టెక్సాస్‌ నుంచి అమెరికా సీ-17 మిలటరీ విమానంలో వాళ్లను భారత్‌కు తరలించారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉన్నవాళ్లను స్వదేశానికి తరలిస్తున్నారు.

తొలి దశలో 20వేల మంది భారతీయులను వెనక్కి పంపించేందుకు అమెరికా రెడీ అయ్యింది.

అమెరికాలో 7 లక్షల 25 వేల మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. అమెరికాలో మనవాళ్లు మూడో అతి పెద్ద ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ సమూహంగా ఉన్నారు. వీళ్లతో పాటు ఇక అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా, ఈ గెంటివేతల కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు. అంతా బ్యాక్‌ టు భారత్‌ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌. అయితే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తరువాతే వాళ్లను వెనక్కి పంపాలని నిర్ణయించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment