విమానాశ్రయానికి ఎన్టీఆర్, రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు???*
విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్, రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్, రామోజీరావులు వారి పరంగాఅందించిన సేవలకు గుర్తింపుగా వారి పేర్లు పెట్టాల్సిన ఆవశ్యకతను చంద్రబాబుకు ఎడిటర్స్ గిల్డ్ వివరించింది. ఇదే విజ్ఞప్తిని పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రికింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అందజేసింది.