వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
గజ్వేల్, 10 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నంగునూరి సత్యనారాయణ మనుమరాలు సిద్ది వర్ష జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా సిద్దిపేటకు చెందిన సిద్ధి వర్ష పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సిద్ది వర్ష ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.