స్వప్న లోక్ లో ఘనంగా అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం

* *స్వప్న లోక్ లో ఘనంగా అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం* 

IMG 20250413 WA2102

ఆయుధం న్యూస్ : కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వప్నలోక్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, యజ్ఞం సంపత్ కుమార్ శర్మ ,అర్చకులు సతీష్ పాండే, అజయ్ పాండే, సాయికుమార్ శర్మల ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు యజ్ఞ హోమం, పూర్ణాహుతి, పంచామృత అభిషేకాలు సుహాసినులచే కళాశాలతో కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కాలనీ పేరే స్వప్నలోక్ అని పేరు పెట్టుకోవడం చాలా అద్భుతంగా ఉందని, సంవత్సరం కాలంలోనే ఎంతో అత్యంత వైభవంగా నిర్మాణం అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కాలనీవాసుల సహకారంతో అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోయేటప్పుడు మన వెంట ఏమి తిసుక వెళ్ళలేమని ఉన్నన్ని రోజులు బాగుండాలని ,తోచిన కాడికి సహాయం చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. అంతేకాకుండా మన పిల్లలకు మంచి మాటలు మంచి బుద్దులు నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ యజమాన్యం కొమిరెడ్డి మారుతి, ఆలయ కమిటీ అధ్యక్షులు పవన్ కుమార్ శర్మ, కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రమాశంకర్, కోశాధికారి సతీష్ , ప్రశాంత్, కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment