Site icon PRASHNA AYUDHAM

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం

WhatsApp Image 2025 02 10 at 5.32.01 PM

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం

– రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి

గజ్వేల్, 10 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అభిషేకం, హోమం, కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ సముదాయం మహిళలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అమ్మవారి నామ స్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం గౌడ సంఘం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగం గారి రాజా గౌడ్, రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజిస్తే అంతా మంచే జరుగుతుందని, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, ముఖ్యంగా లోక కళ్యాణార్థం ప్రతి ఏటా జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ సభ్యులు పంజాల గణేష్ గౌడ్, సింగీతం అశోక్ గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, జంగం శ్రీనివాస్ గౌడ్, జంగం బలరాం గౌడ్, తాళ్ల నాగరాజు గౌడ్, పంజాల రాజ మల్లయ్య గౌడ్, అప్కారి సుధాకర్ గౌడ్, జంగం వెంకట్ గౌడ్, పంజల రాజు గౌడ్, బాలయ్య గారి స్వామి గౌడ్, అంకుర్ గారి భూమా గౌడ్, సత్యనారాయణ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, బబ్బురి స్వామి గౌడ్, సంగుపల్లి నరసింహులు గౌడ్, నక్క రేగొండ గౌడ్, మురళి గౌడ్, పంజాల శంకర్ గౌడ్, రాయపొల్ దుర్గాప్రసాద్ గౌడ్, సంగుపల్లి తిరుపతి గౌడ్, బొర్జ నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version