అప్స స్వచ్ఛంద సంస్థ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం
అంగన్వాడి టీచర్ సరిత
ప్రశ్న ఆయుధం మే 16
హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ పరిధిలో ఎం సి హెచ్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో అప్స స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సందర్భంగా శుక్రవారం రోజున అంగన్వాడి టీచర్ సరిత పాల్గొనడం జరిగింది ఆమె మాట్లాడుతూ చిన్న వయసు నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బాల బాలికలకు అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్థాల గురించి వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది పిల్లల్లో ఐరన్ తగ్గడం వల్ల వచ్చే నష్టాల గురించి వివరించడం జరిగింది అందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాలామృతం పంపిణీ చేయడం జరుగుతుందని వివరించడం జరిగింది అనంతరం అప్సా స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ రక్తహీనత లోపం వలన చాలామంది బాలబాలికలు ఇబ్బంది పడుతున్నారని ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని ఆరోగ్య అలవాట్లు ఇప్పటినుండే ఏర్పరచుకొని బాల బాలికలు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉన్నప్పుడే కుటుంబంలో సంతోషం ఉంటుందని అన్నారు అనంతరం సీనియర్ జర్నలిస్టు రమేష్ మాట్లాడుతూ అప్స స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మరియు వేసవి శిక్షణ శిబిరాలతో వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం పేద మధ్యతరగతి బాల బాలికలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో భాగంగా బాల బాలికలకు వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది కార్యక్రమ తదనంతరం బస్తి బాల బాలికలతో అప్స స్వచ్ఛంద సంస్థ సహాయ కోఆర్డినేటర్ ముస్తాల లావణ్య తన జన్మదిన వేడుక జరుపుకోవడం జరిగింది పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి బస్తీ పిల్లలకు తన జన్మదినం సందర్భంగా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లావణ్య మాట్లాడుతూ నా జన్మదినం ఈ బాల బాలికల మధ్య జరుపుకోవడం నాకు ఎంతో సంతోషకరం అన్నారు నాకు ఈ అవకాశం కల్పించిన అప్స సంస్థకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని నాకు సహకరించిన మా అప్స స్వచ్ఛంద సంస్థ యాజమాన్యానికి సీనియర్ కోఆర్డినేటర్ రమేష్ కు సహాయ కోఆర్డినేటర్ ఊర్ల శ్రావణి కి కృతజ్ఞతలు తెలిపారు.